Share News

‘సర్‌’ గడువు మరోసారి పొడిగింపు

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:07 AM

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026 (సర్‌) గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. నోటీసులు, క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారానికి ఈ నెల 10 వరకు ఉన్న గడువును 22వ తేదీకి గడువు పొడిగించింది.

‘సర్‌’ గడువు మరోసారి పొడిగింపు

  • 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

  • క్లెయిములు, అభ్యంతరాలకు 22 వరకు గడువు

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026 (సర్‌) గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. నోటీసులు, క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారానికి ఈ నెల 10 వరకు ఉన్న గడువును 22వ తేదీకి గడువు పొడిగించింది. అలాగే తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువు 16వ తేదీ వరకు ఉండగా, దానిని తాజాగా 30వ తేదీకి పొడిగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 10వ తేదీ వరకు అందిన పెండింగ్‌ క్లెయిములు, అభ్యంతరాలతోపాటు ఆ తర్వాత అక్టోబరు 12వ తేదీ వరకు అందిన దరఖాస్తులు, అభ్యంతరాలన్నింటినీ ఈ నెల 22లోగా పరిష్కరించాలని సీఈవో వివేక్‌ యాదవ్‌ ఎన్నికల అధికారులను ఆదేశించారు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం జిల్లా ఎన్నికల అధికారులు తమ కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించి నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:07 AM