Share News

కనీస దరఖాస్తులు వస్తేనే లాటరీ

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:31 AM

మద్యం షాపుల లైసెన్సుల జారీకి లాటరీ నిర్వహణపై ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తుల సంఖ్యపై మరో నిర్ణయం తీసుకుంది.

కనీస దరఖాస్తులు వస్తేనే లాటరీ

  • మద్యం షాపుల లాటరీపై ప్రభుత్వ నిర్ణయం

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మద్యం షాపుల లైసెన్సుల జారీకి లాటరీ నిర్వహణపై ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తుల సంఖ్యపై మరో నిర్ణయం తీసుకుంది. 50వేలలోపు జనాభా ఉంటే 4 దరఖాస్తులు, 50వేల నుంచి 5లక్షల జనాభా ఉంటే 6 దరఖాస్తులు, 5లక్షలు దాటిన చోట్ల 8 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలని నిర్ణయించింది. దరఖాస్తుల గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. 807 షాపులకు నోటిఫికేషన్లు జారీచేయగా ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తులతో 510 షాపులకు లాటరీ తీసే అవకాశం ఉంది. మిగిలిన షాపులకు కనీస సంఖ్యలో రాకపోవడంతో లాటరీ తీయరు. కాగా, గురువారం షాపులకు లాటరీ నిర్వహించి వెంటనే లైసెన్సీలను ఎంపిక చేస్తారు. తిరుపతి రూరల్‌ మండలంలో షాపునకు అత్యధికంగా 29, అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో షాపునకు 16 దరఖాస్తులు వచ్చాయి.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 04:31 AM