గత పీఆర్సీలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయండి
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:13 AM
గత ప్రభుత్వం ఇచ్చిన 11వ పీఆర్సీలో ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని 12వ పీఆర్సీలో భర్తీ అయ్యేలా చూడాలని పీఆర్సీ చైర్మన్ దినేశ్ కుమార్‌ను కోరినట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు గొలిమి రామకృష్ణ తెలిపారు
ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ
గత ప్రభుత్వం ఇచ్చిన 11వ పీఆర్సీలో ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని 12వ పీఆర్సీలో భర్తీ అయ్యేలా చూడాలని పీఆర్సీ చైర్మన్ దినేశ్ కుమార్‌ను కోరినట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు గొలిమి రామకృష్ణ తెలిపారు. దినేశ్ కుమార్‌ను అప్సా తరపున మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. అప్సా ప్రతినిధులు వివరించిన అంశాలను ఆయన సానుకూలంగా విన్నారని, ఉద్యోగ సంఘాలు సమర్పించే అంశాలను పరిశీలించి, తగిన విధంగా పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: