మూడు పార్టీలకు కామన్ సింబల్
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:07 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కామన్ సింబల్ కేటాయించింది. జాతీయ సమసమాజం పార్టీకి బ్యాట్ గుర్తు, భారత చైతన్య యువజన పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు..
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కామన్ సింబల్ కేటాయించింది. జాతీయ సమసమాజం పార్టీకి బ్యాట్ గుర్తు, భారత చైతన్య యువజన పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రె్స(సెక్యులర్) పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించింది. రాష్ట్రఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం స్థానాలకు ఆయా పార్టీలు అభ్యర్థులను నిలబెట్టినప్పుడే కామన్ సింబల్ కేటాయింపు వర్తిస్తుంది. ఈ గుర్తుల కేటాయింపు ఒక్కసారి మాత్రమే కల్పించే వెసులుబాటు అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఈ మూడు పార్టీలకు కేటాయించిన గుర్తులు వర్తిస్తాయని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు