విద్యార్థి దినచర్యలో యోగా భాగం కావాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:41 AM
యోగాను ప్రతి విద్యార్థి దినచర్యలో భాగం చేయాలని, యోగా ద్వారా పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, మానసిక పటిష్టతలు పెరుగుతాయని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు అన్నారు.
సమగ్రశిక్ష పీడీ శ్రీనివాసరావు
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): యోగాను ప్రతి విద్యార్థి దినచర్యలో భాగం చేయాలని, యోగా ద్వారా పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, మానసిక పటిష్టతలు పెరుగుతాయని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు అన్నారు. ఏపీ సమగ్రశిక్ష, హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్రంలోని పీఎంశ్రీ పాఠశాలల టీచర్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. కార్యక్రమంలో హార్ట్‌ఫుల్‌నెస్ గైడ్ దాజీ, యోగా అకాడమీ డైరెక్టర్ డా.వెరోనిక్ నికోలాయ్ పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం