Share News

ఇమామ్‌ల గౌరవ వేతనాలకు రూ.22 కోట్లు

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:12 AM

రాష్ట్రంలోని మసీదుల్లోని మతపరమైన సేవలందించే ఇమామ్‌లు, మౌజన్ల గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం రూ.22.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇమామ్‌ల గౌరవ వేతనాలకు రూ.22 కోట్లు

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మసీదుల్లోని మతపరమైన సేవలందించే ఇమామ్‌లు, మౌజన్ల గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం రూ.22.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి ఈ నిధులు విడుదల చేసింది. నిధులు విడుదలపై రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:12 AM