పరిశ్రమలకు రూ.142.48 కోట్ల ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:45 AM
రాష్ట్రంలో అర్హమైన పరిశ్రమలకు పెండింగ్ ఇన్సెంటివ్స్ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.142.48 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పెండింగ్ ఇన్సెంటివ్స్ విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హమైన పరిశ్రమలకు పెండింగ్ ఇన్సెంటివ్స్ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.142.48 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, ఎస్సీ పారిశామ్రికవేత్తలకు వీటిని చెల్లించనున్నారు. రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు చెల్లించేందుకు ప్రభుత్వం దాదాపుగా రూ.1,400 కోట్ల నిధులు కేటాయించింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబకు ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!