Share News

100కే కందిపప్పు.. 125కి పామాయిల్‌

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:13 AM

రానున్న క్రిస్మస్‌, సంక్రాంతి పండగలను దృష్టిలో పెట్టుకుని రేషన్‌ కార్డులున్న పేదలకు తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

100కే కందిపప్పు.. 125కి పామాయిల్‌

  • రేషన్‌ షాపుల ద్వారా తక్కువ ధరకు నిత్యావసరాలు

  • పండుగల వేళ ధరల భారం నుంచి పేదలకు ఊరట

  • వచ్చే మూడు నెలలు అమలు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రానున్న క్రిస్మస్‌, సంక్రాంతి పండగలను దృష్టిలో పెట్టుకుని రేషన్‌ కార్డులున్న పేదలకు తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా రూ.100కే కిలో కందిపప్పు, రూ.125కే లీటరు పామాయిల్‌, రూ.25కే కిలో గోధుమ పిండి చొప్పున అందించడం ద్వారా పేదలకు ధరల భారం నుంచి ఊరట కల్పించనున్నారు.

డిసెంబరు నుంచి మూడు నెలలపాటు రాయితీపై నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మూడు నెలలకు గానూ రూ.300.60 కోట్ల మేర ఆర్థిక భారం పడనుంది. ఈ మేరకు రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌, ప్రభుత్వ ఎక్స్‌-అఫిషియో కార్యదర్శి కె.కన్నబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:15 AM