17 వరకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్పై అవగాహన
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:10 AM
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వారోత్సవాలు ఈనెల 17 వరకు కొనసాగుతాయని ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రూ.లక్ష కోట్లతో చేపడుతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల రైతులకు
అమరావతి, అక్టోబరు14 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వారోత్సవాలు ఈనెల 17 వరకు కొనసాగుతాయని ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రూ.లక్ష కోట్లతో చేపడుతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల రైతులకు జరిగే మేలుపై ఇప్పటికే రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యానశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. రాయలసీమ రైజింగ్ పేరుతో రైతుసేవా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రయోజనాలతో పాటు 10 జిల్లాల్లోని 303 మండలాల పరిధిలోని 201 క్లస్టర్లలో రాయలసీమ సమీకృత ఉద్యాన అభివృద్ధి (ఐహెచ్డీపీ) పథకంలో ఏ జిల్లాకు ఎన్ని నిధులు వెచ్చించనున్నారో రైతులకు వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇస్తూ, ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..