Share News

తుది పోలింగ్ 62.16 శాతం

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:30 AM

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తుది పోలింగ్‌ 62.16 శాతంగా నమోదైంది. అలాగే 3 కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లోని 13 పోలింగ్‌ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు.

తుది పోలింగ్ 62.16 శాతం

  • 3 కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లోని 13 కేంద్రాల్లో రీపోలింగ్‌ ప్రశాంతం

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తుది పోలింగ్‌ 62.16 శాతంగా నమోదైంది. అలాగే 3 కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లోని 13 పోలింగ్‌ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ 13 బూత్‌లలో మొత్తం 9890 మంది ఓటర్లకు గాను 6041 మంది ఓట్లు వేశారు. ఆదివారం పోలింగ్‌ సందర్భంగా పలు ఆరోపణలు రావడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల మేరకు.. కడప జిల్లాలోని కడప కార్పొరేషన్‌ 15వ డివిజన్‌లోని 15/2 పోలింగ్‌ కేంద్రంలో, జమ్మలమడుగు 3, 17, 29వ వార్డుల్లోని 3/2, 17/1, 29/1 పోలింగ్‌ కేంద్రాలు, పులివెందుల మున్సిపాలిటీ 1, 3, 7, 8 వార్డుల్లో 1/1, 3/1, 7/1, 8/1 పోలింగ్‌ కేంద్రాల్లో, ప్రకాశం జిల్లా చీమకుర్తి 14వ వార్డులో 14/1 పోలింగ్‌ కేంద్రంలో, పల్నాడు జిల్లా మాచర్ల 23వ వార్డులోని 23/1, 23/2 పోలింగ్‌ కేంద్రాల్లో, తిరుపతి కార్పొరేషన్‌ 36వ డివిజన్‌లో 36/4 పోలింగ్‌ కేంద్రంలో, అనంతపురం కార్పొరేషన్‌ 30వ డివిజన్‌లో 30/3 పోలింగ్‌ కేంద్రంలో ఈ రీపోలింగ్‌ జరిగింది.

పులివెందులలోని 4 బూత్‌లలో 63.4 శాతం, జమ్మలమడుగు 2 బూత్‌లలో 67.9శాతం, చీమకుర్తి పోలింగ్‌ కేంద్రంలో 73.44 శాతం, మాచర్ల 2 బూత్‌లలో 59.52శాతం.., కడప కార్పొరేషన్‌లోని పోలింగ్‌ కేంద్రంలో 69.6శాతం, తిరుపతి డివిజన్‌ బూత్‌లో 50.38శాతం, అనంతపురం డివిజన్‌ బూత్‌లో 52.85శాతం ఓటింగ్‌ నమోదైంది. దరిమిలా ఆదివారం అర్ధరాత్రి ఎస్‌ఈసీ ప్రకటించిన 60.96 శాతం పోలింగ్‌.. కాస్త పెరిగి 62.16 శాతానికి చేరుకుంది.

2021తో పోలిస్తే 3.69శాతం తగ్గుదల

నగరపాలక, పురపాలక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గత ఎన్నికలతో పోలిస్తే బాగా తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 65.85 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఆదివారం నాటి ఎన్నికల్లో 62.16 శాతం నమోదైంది. అంటే 3.69 శాతం తగ్గింది.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 05:30 AM