మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:51 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పోరేషన్లను ఆదేశించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పోరేషన్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం.. రేపటి నుంచి 11వ తేదీ వరకు ఏడు రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈనెల 12వ తేదీన మున్సిపల్ కార్పోరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్‌కు సమర్పించనున్నారు.
13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్‌లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కలు ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇవి కూడా చదవండి
మతిస్థిమితం లేని యువతిపై యువకుడి అత్యాచారయత్నం.. హీరోలా అడ్డుకున్న వీధి కుక్క..