Share News

మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్‌-2లో ఉచిత శిక్షణ

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:56 AM

ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం పోటీపడే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

 మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్‌-2లో ఉచిత శిక్షణ

  • ఈ నెలాఖరు వరకు దరఖాస్తులకు గడువు

అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం పోటీపడే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. ఈ నెల 31లోగా అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలోని సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీ్‌స(సీఈడీఎం) నేతృత్వంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. ఆఫ్‌లైన్‌ కోచింగ్‌కు బీపీఎల్‌ కార్డు కలిగి ఉండడం తప్పనిసరిగా పేర్కొన్నారు. apcedmmwd.org. ద్వారా లేదా సెల్‌ 08645-297535, 7386789966 నంబర్లను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని మంత్రి సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:56 AM