వైసీపీ చర్యలను ఉపేక్షించం: ఏపీ మంత్రులు
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:34 AM
ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
వైసీపీ చర్యలను ఉపేక్షించం: మంత్రి గొట్టిపాటి
ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గురువులపై రౌడీ మూకలతో దాడులు చేయించడాన్ని ఏ మాత్రం ఉపేక్షించేది లేదు’ అని మంత్రి అన్నారు.
టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు: అచ్చెన్న
వైసీపీ దాడులను మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన ఓ ప్రకటన చేస్తూ... ఈ ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను ఫేక్ అంటూ వారి ఆత్మగౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయడం దుర్మార్గం’ అని అచ్చెన్న అన్నారు.
వైసీపీ అరాచకానికి పరాకాష్ఠ: మంత్రి కొల్లు
డీఎస్సీ గురించి మాట్లాడే కనీస అర్హత వైసీపీకి లేదని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఉపాధ్యాయులపై దాడులు వైసీపీ అరాచకానికి పరాకాష్ఠ. ఉపాధ్యాయుల ఆత్మగౌరవంతో ఆడుకుంటాం, దాడులు చేస్తామంటే చర్యలు తప్పవు’ అని మంత్రి కొల్లు హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక