బీసీల ద్వేషి జగన్
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:09 AM
టీడీపీకి అనుకూలంగా ఉంటారని బీసీలంటే మొదటి నుంచీ జగన్‌కు ద్వేషమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
బీసీలకు అండగా నిలిచేది టీడీపీనే
మంత్రులు కొలుసు, అనగాని, గొట్టిపాటి
రేపల్లె, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): టీడీపీకి అనుకూలంగా ఉంటారని బీసీలంటే మొదటి నుంచీ జగన్‌కు ద్వేషమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో రూ.56 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌లతో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో కక్షలు, కార్పణ్యాలు, దాడులు తప్ప అభివృద్ధి దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్షహోదా లేకుండా 11 సీట్లకే పరిమితం చేసినా నేటికీ బుద్ధి రాలేదు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే అడుగడుగునా కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు’ అని మండిపడ్డారు. మంత్రి అనగాని మాట్లాడుతూ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినాఅంతిమ విజయం బీసీలదేనని, వారికి రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్