విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:47 AM
విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని మంత్రి పి.నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నుంచి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
త్వరలో పనులు ప్రారంభం: మంత్రి నారాయణ
విశాఖపట్నం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని మంత్రి పి.నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నుంచి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.3,531.47 కోట్లతో జీవీఎంసీ పరిధిలో, రూ.360.49 కోట్ల వ్యయంతో వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పీఎం పాలెంలోని వీ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం