‘రేర్ ఎర్త్ మినరల్స్’కు సహకరించండి
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:56 AM
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో రష్యా కీలక భాగస్వామి అని రాష్ట్ర మంత్రి లోకేశ్ అన్నారు. పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా నిర్వహించిన రష్యా-ఇండియా ఆర్థిక భాగస్వామ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు.
రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం
విశాఖపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో రష్యా కీలక భాగస్వామి అని రాష్ట్ర మంత్రి లోకేశ్ అన్నారు. పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా నిర్వహించిన రష్యా-ఇండియా ఆర్థిక భాగస్వామ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత్-రష్యా బంధం పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక రంగాలకూ విస్తరించాలని లోకేశ్ ఆకాంక్షించారు. రష్యా సాంకేతిక నైపుణ్యాన్ని, భారత్‌లోని వనరులు, అవకాశాలతో అనుసంధానం చేస్తే పరస్పర ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని రేర్ ఎర్త్ మినరల్స్ రంగం అభివృద్ధికి ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ రంగంలో పరిశోధనలు, సాంకేతిక సహకారం, పారిశ్రామిక అవకాశాల కల్పనకు రష్యాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఏపీలో పెట్టుబడులకు రష్యా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్, వాణిజ్య ప్రతినిధులు, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక, పెట్టుబడుల సదస్సులో ‘పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్’ అనే అంశంపై లోకేశ్ మాట్లాడుతూ, క్లీన్ ఎనర్జీలో సౌదీ అరేబియాలాగా ఏపీని తీర్చిదిద్దుతామని అన్నారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా ఆ విద్యుత్‌ను గ్రీన్ మాలిక్యూల్స్‌గా మార్చి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడంతో పాటు దేశీయంగా ఇంధన అవసరాలు తీర్చుకోవచ్చునన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు