రూ.49కే నాణ్యమైన సన్నబియ్యం
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:27 AM
కూటమి ప్రభుత్వం తక్కువ ధరకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని భవానీపురం రైతుబజారులో ...
రైతుబజార్లలో ఇప్పటికే బీపీటీ విక్రయాలు: మంత్రి మనోహర్
విజయవాడ అర్బన్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తక్కువ ధరకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని భవానీపురం రైతుబజారులో ప్రత్యేక కౌంటర్ ద్వారా సబ్సిడీ సన్నబియ్యం విక్రయాలను సోమవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభానుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇప్పటికే రైతుబజారులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బీపీటీ రకం సన్నబియ్యాన్ని అందిస్తోందని, అదనంగా కేఎన్‌ఎం, ఆర్‌ఎన్‌ఆర్ రకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన సన్నబియ్యం ధర కిలో రూ.90 ఉండగా, ఈ కౌంటర్లలో కిలో రూ.49కే విక్రయించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీసుకున్న నిర్ణయం సామాన్యులకు ఆర్థిక ఊరట కలిగిస్తుందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి: