తప్పించుకునేందుకే కాలయాపన
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:03 AM
వాస్తవాలను పక్కదారి పట్టించి, వాటిని రాజకీయంగా వాడుకోవడమే వైఎస్ జగన్ రాజకీయ నీతి అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
జగన్ కేసులపై మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): వాస్తవాలను పక్కదారి పట్టించి, వాటిని రాజకీయంగా వాడుకోవడమే వైఎస్ జగన్ రాజకీయ నీతి అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సుమారు రూ.48 వేల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్, ఆ కేసుల్లో కోర్టుకు హాజరై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకుండా కాలయాపన చేస్తూ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈడీ విచారణను వేగవంతం చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక నేరాలు సమాజానికి, దేశఆర్థిక వ్యవస్థకు క్యాన్స ర్ వంటివని సుప్రీంకోర్టు చెప్పిందని, అలాంటి కేసులను సుదీర్ఘకాలం సాగదీయవచ్చా? అని ప్రశ్నించారు. జగన్ కేసుల విచారణను త్వరితగతిని పూర్తి చేసి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్