Share News

వచ్చే రెండేళ్లూ విద్యుత్‌ చార్జీలు పెంచం

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:31 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ చార్జీలు పెంచలేదని, రాబోయే రెండున్నర సంవత్సరాలలో కూడా పెంచే ప్రసక్తే లేదని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు.

 వచ్చే రెండేళ్లూ విద్యుత్‌ చార్జీలు పెంచం

  • ఎల్‌నినోలోనూ ఇబ్బంది లేకుండా సరఫరా: మంత్రి గొట్టిపాటి

సంతమాగులూరు(అద్దంకి), అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ చార్జీలు పెంచలేదని, రాబోయే రెండున్నర సంవత్సరాలలో కూడా పెంచే ప్రసక్తే లేదని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో రూ.35.78 కోట్లతో నిర్మించనున్న 132/33కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగినప్పటికీ ఇబ్బంది లేకుండా ఉత్పత్తి చేస్తూ సరఫరా చేస్తున్నామన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 05:31 AM