Share News

నేడు డీఎస్సీ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:18 AM

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇప్పటికే షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయగా దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ ఇప్పుడు విడుదల చేస్తారు. ఇప్పటికే ప్రకటించిన..

నేడు డీఎస్సీ నోటిఫికేషన్‌

  • జనరల్‌, క్రీడా పోస్టులు కూడా.. క్రీడల కోటాలోనూ రాత పరీక్ష.. 2,721 పోస్టుల భర్తీకి చర్యలు

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇప్పటికే షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయగా దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ ఇప్పుడు విడుదల చేస్తారు. ఇప్పటికే ప్రకటించిన.. 2,721 పోస్టులతో ఈ నోటిఫికేషన్‌ రానుంది. విద్యార్హతలు, సిలబస్‌ వివరాలను ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. మెగా డీఎస్సీలో క్రీడా కోటాకు శాప్‌ విడిగా నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. కానీ, ఈ డీఎస్సీలో క్రీడా పోస్టులను కూడా జనరల్‌ పోస్టులతో కలిపి భర్తీ చేయనున్నారు. అలాగే, క్రీడా కోటా అభ్యర్థులకు కూడా రాత పరీక్ష నిర్వహిస్తారు.

గత డీఎస్సీ తరహాలోనే హారిజంటల్‌ రిజర్వేషన్‌ విధానం అమలు చేస్తారు. మొత్తం పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ జనరల్‌ 931, స్కూల్‌ అసిస్టెంట్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 255, ఎస్జీటీ జనరల్‌ 1,231, ఎస్జీటీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 304 పోస్టులు ఉన్నాయి. వీటిలోనే వయోజన విద్యలో 4, గ్రంథాలయాల్లో 100, డైట్‌, ఎస్‌సీఈఆర్‌టీలో 174 పోస్టులు కూడా ఉంటాయి. షెడ్యూలు ప్రకారం మంగళవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాలి. పూర్తిస్థాయి సమాచారం అందకపోవడంతో మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసి, దరఖాస్తుల స్వీకరణ తేదీలను వెల్లడించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 05:18 AM