Share News

తుంగభద్ర నీటి కాలుష్యంపై లోకాయుక్త ఆగ్రహం

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:29 AM

కర్నూలు నగరంలోని మాసామసీదు పంప్‌ హౌస్‌ సమీపంలోని కెనాల్‌లో కొంత మంది ప్రైవేటు ట్యాంకర్‌ యజమానులు మురుగునీటిని డంప్‌ చేసి తుంగభద్ర నదిని కాలుష్యం చేయడంపై రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ టి.మల్లికార్జునరావు...

తుంగభద్ర నీటి కాలుష్యంపై లోకాయుక్త ఆగ్రహం

  • కర్నూలు ఎస్పీ, మున్సిపల్‌ కమిషనర్‌, పర్యావరణ ఇంజనీర్లకు నోటీసులు

కర్నూలు లీగల్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలోని మాసామసీదు పంప్‌ హౌస్‌ సమీపంలోని కెనాల్‌లో కొంత మంది ప్రైవేటు ట్యాంకర్‌ యజమానులు మురుగునీటిని డంప్‌ చేసి తుంగభద్ర నదిని కాలుష్యం చేయడంపై రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ టి.మల్లికార్జునరావు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన కర్నూలు జిల్లా ఎస్పీతో పాటు కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, పర్యావరణ ఇంజనీర్‌కు నోటీసులు జారీ చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకును సుమోటోగా కేసు నమోదు చేయాలని లోకాయుక్త జస్టిస్‌ పి.మల్లికార్జునరావు ఎస్పీని ఆదేశించారు. ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి వెళ్లి మురుగునీరు డంప్‌ చేసిన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయాలన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:29 AM