Share News

గాంధీజీ మార్గం... ప్రపంచ నేతలకు స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:21 AM

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు.

గాంధీజీ మార్గం... ప్రపంచ నేతలకు స్ఫూర్తిదాయకం

  • మహాత్మునికి, లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులర్పించిన గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నజీర్‌ మాట్లాడుతూ, ‘శాంతియుత ప్రతిఘటన, సామూహిక శాసనోల్లంఘన అనే ఆయన మార్గం ప్రపంచ వ్యాప్తంగా నాయకులకు స్ఫూర్తిని ఇచ్చింది’ అని పేర్కొన్నారు. అలా నే నిజాయతీకి మారుపేరైన మాజీ ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్‌ శాస్ర్తి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి లోకేశ్‌ వారిరువురికీ నివాళులర్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ జాతిపిత, శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పవన్‌ నివాళులు...

సత్యం, అహింస, నిస్వార్థ సేవలపై అచంచలమైన విశ్వాసంతో దేశానికి స్ఫూర్తినిచ్చి, తరతరాలకు ప్రేరణగా నిలుస్తున్న మహాత్మా గాంధీజీకి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నివాళులు ఆర్పించారు. మన గ్రామాలను బలోపేతం చేయడం, సమాజాలను శక్తివంతం చేయడం, స్వయం సమృద్ధిని ప్రోత్సహించడం ద్వారా మనం మరింత బలమైన, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించగలమని పవన్‌ పేర్కొన్నారు. మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రికి పవన్‌ నివాళులుర్పించారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 05:21 AM