Share News

ఆరు మాసాల్లో నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:19 AM

12వ పీఆర్సీ నివేదికను ఆరు మాసాల్లో ప్రభుత్వానికి అందించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు

ఆరు మాసాల్లో నివేదిక ఇవ్వండి

  • పీఆర్సీ కమిషన్‌కు ఏపీ జేఏసీ అమరావతి వినతి

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): 12వ పీఆర్సీ నివేదికను ఆరు మాసాల్లో ప్రభుత్వానికి అందించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అమరావతి సచివాలయంలో పీఆర్సీ కమిషన్‌ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ను కలసి వినతి పత్రం అందించారు. ‘ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌కు నివేదిక సమర్పించేందుకు ఒక సంవత్సరం కాలపరిమితి ఇచ్చింది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, డేటాను, డిజిటల్‌ విధానాలను, రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు కోసం అన్ని శాఖల్లో అప్డేట్‌గా ఉంచిన ఉద్యోగులకు సంబంధించిన డేటాను వినియోగించుకుని ఆరు మాసాల్లోనే నివేదికను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలి.

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం, గృహ నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను నిర్వహించడం ఉద్యోగులకు భారంగా మారుతోంది. వేతన సవరణలో జాప్యం కారణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోవడమే కాకుండా, వారి కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు కూడా దెబ్బతింటున్నాయి. గత 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిల చెల్లింపులు ఇంకా పూర్తికాకపోవడం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. గతంలో పీఆర్సీ ప్రక్రియలో జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సారి నివేదిక తయారీలో కాలయాపనకు తావులేకుండా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను త్వరితగతిన సేకరించాలి’ అని పీఆర్సీ కమిషన్‌ చైర్మన్‌ను కోరామని బొప్పరాజు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 07:19 AM