Share News

ఉద్యమాల్లో మహిళా ఉద్యోగులదే కీలక పాత్ర

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:06 AM

ఏపీ జేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమాల్లో మహిళా ఉద్యోగులదే కీలకపాత్ర అని ...

ఉద్యమాల్లో మహిళా ఉద్యోగులదే కీలక పాత్ర

  • 25న మహిళా విభాగం నూతన కమిటీ: బొప్పరాజు

విజయవాడ (గాంధీనగర్‌), అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ జేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమాల్లో మహిళా ఉద్యోగులదే కీలకపాత్ర అని జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ కాలపరిమితి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో 25న రాష్ట్రస్థాయి సదస్సుతో పాటు నూతన కార్యవర్గాన్ని ప్రకటించనున్నామని తెలిపారు. 25న స్థానిక రెవెన్యూ భవన్‌లో జరిగే సదస్సులో 28 జిల్లాల డివిజన్‌, జిల్లా కమిటీలు, రాష్ట్రస్థాయి మహిళా నేతలు, ప్రతినిధులు పాల్గొనాలని జేఏసీ మహిళా విభాగం చైర్‌పర్సన్‌ పారేపల్లి లక్ష్మి, సెక్రటరీ జనరల్‌ పొన్నూరు విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జేఏసీ సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 05:06 AM