ఉదయగిరి డీఈఈ పుల్లయ్య సస్పెన్షన్
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:33 AM
నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ డివిజన్ డీఈఈ మల్లాపు పుల్లయ్యను సస్పెండ్ చేస్తూ జలవనరుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఅండ్ఎం పనులకు సంబంధించిన బిల్లుల ప్రాసెసింగ్, రికార్డుల నమోదులో డీఈఈ నిర్లక్ష్యం వహించినట్లు జలవనరుల శాఖ గుర్తించి, ఈమేరకు చర్యలు తీసుకుంది.
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ డివిజన్ డీఈఈ మల్లాపు పుల్లయ్యను సస్పెండ్ చేస్తూ జలవనరుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఅండ్ఎం పనులకు సంబంధించిన బిల్లుల ప్రాసెసింగ్, రికార్డుల నమోదులో డీఈఈ నిర్లక్ష్యం వహించినట్లు జలవనరుల శాఖ గుర్తించి, ఈమేరకు చర్యలు తీసుకుంది. సాగునీటి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి ఇరిగేషన్ శాఖ స్పష్టం చేశారు. పనుల నిర్వహణ, బిల్లుల నమోదు, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై నిబంధనల ప్రకారం చర్య లు తీసుకుంటామని ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అండ్ చీఫ్ (అడ్మిన్) వరప్రసాద్ స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు