పెట్టుబడులతో ఏపీకి తరలిరండి
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:59 AM
స్విట్జర్లాండ్‌తో ఏపీకి ఉన్న ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రి టీజీ భరత్ కీలక చర్చలు నిర్వహించారు. స్విస్ కాన్ఫెడరేషన్ స్టేట్ సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ హెలెనా బుడ్లిగర్ ఆర్టియడాతో సోమవారం మంత్రి భరత్ భేటీ అయ్యారు.
స్విట్జర్లాండ్ పారిశ్రామిక వేత్తలకు
మంత్రి టీజీ భరత్ ఆహ్వానం
న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): స్విట్జర్లాండ్‌తో ఏపీకి ఉన్న ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రి టీజీ భరత్ కీలక చర్చలు నిర్వహించారు. స్విస్ కాన్ఫెడరేషన్ స్టేట్ సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ హెలెనా బుడ్లిగర్ ఆర్టియడాతో సోమవారం మంత్రి భరత్ భేటీ అయ్యారు. అలాగే, స్విస్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్న ‘‘ఏపీ-స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరమ్’’ సదస్సులో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు. పారిశ్రామికవేత్తలకు సింగిల్ డెస్క్ విధానంలో పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని స్విస్ పారిశ్రామిక వర్గాలను ఆహ్వానించారు. ఈ సదస్సులో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం