యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:50 AM
‘పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం ఎంతో కీలకం. పోలీసు యూనిఫారం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలి’ అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్‌లో నూతన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం జరిగింది. 2025-26 బ్యాచ్‌కు చెందిన 149 మంది పోలీసు సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.
6 వేల కానిస్టేబుళ్ల నియామకాల్లో ఎన్నో అడ్డంకులు: అనిత
మంగళగిరి సిటీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం ఎంతో కీలకం. పోలీసు యూనిఫారం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలి’ అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్‌లో నూతన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం జరిగింది. 2025-26 బ్యాచ్‌కు చెందిన 149 మంది పోలీసు సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి అనిత శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘6 వేల మంది కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులను అధిగమించాం. ట్రైనింగ్‌లో వున్న కానిస్టేబుళ్ల స్టైపెండ్ రూ.4,500 నుంచి రూ.12 వేలకు పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక. ఉపాధ్యాయులపై కొందరు దుష్ప్రచారం చేయడం, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడడం వలన టీచర్లు తీవ్రంగా బాధపడుతున్నారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తాం’ అని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సిబ్బందికి అవార్డులను అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం