Share News

ఉన్నత విద్యలో డిజిటల్‌ పాఠ్యాంశాలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:21 AM

ఉన్నత విద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఉన్నత విద్యలో డిజిటల్‌ పాఠ్యాంశాలు

  • నేడు ప్రారంభించనున్న ఉన్నత విద్యామండలి

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఎల్‌ఎంఎస్-మూక్స్‌ వేదికను రూపొందించింది. దీనిని ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.విజయభాస్కరరావు బుధవారం ప్రారంభించనున్నారు. దీన్ని విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ కూడా ఉపయోగించుకోవచ్చని మండలి తెలిపింది. ఈ విధానంలో పూర్తిచేసే కోర్సులకు క్రెడిట్లు కూడా ఇస్తారు. విద్యార్థులు ఇందులో రిజిస్ర్టేషన్‌ చేసుకుని డిజిటల్‌ కోర్సులను నేర్చుకోవచ్చు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 01:22 AM