Share News

నకిలీ ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లతో డీఎస్సీ ఉద్యోగాలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:40 AM

డీఎస్సీ 2025 నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందారని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ..

నకిలీ ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లతో డీఎస్సీ ఉద్యోగాలు

  • సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్‌

డీఎస్సీ 2025 నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందారని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు చెందిన పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

విచారణను నవంబరు 19కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. డీఎస్సీ 2025 నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 1500 మంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలకు ఎంపికయ్యారని, దీనిపై ఈ ఏడాది సెప్టెంబరు 23న తాను సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకు చెందిన ప్రతాప్‌రెడ్డి, మరో 8మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 01:43 AM