కేసు విచారణ రోజు కౌంటర్ వేయడం ఏంటి?
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:59 AM
ఎన్‌సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ టెట్ నిర్వహించడం లేదంటూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ వేసిన మరో పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ ప్రారంభమైన వెంటనే విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ...
అధికారులపై హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
ఎన్‌సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ టెట్ నిర్వహించడం లేదంటూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ వేసిన మరో పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ ప్రారంభమైన వెంటనే విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ... వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న పాఠశాల విద్య కమిషనర్ బుధవారం కౌంటర్ వేశారని తెలిపారు. పిల్‌పై విచారణలో రాష్ట్ర విద్యా పరిశోధన మండలి కౌంటర్ కీలకమని, అందుకు సమయం ఇవ్వాలని కోరారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... వ్యాజ్యం విచారణకు వచ్చిన రోజు కౌంటర్ వేయడం ఏంటని ప్రశ్నించింది. ఇది కారణంగా చూపుతూ వాయిదాలు పొందడం న్యాయ విచారణ ప్రక్రియను అపహాస్యం చేయడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటిషనర్ వేసిన రెండు వ్యాజ్యాలను కలిపి విచారణ జరుపుతామంటూ వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి..