జస్టిస్ అవినాష్ భాటేకు హైకోర్టు ఘన నివాళి
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:24 AM
ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవినాష్ సోమకాంత్ భాటేకు సోమవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. ఇటీవల మరణించిన మహారాష్ట్రకు చెందిన జస్టిస్ అవినాష్ సోమకాంత్ భాటేకు నివాళి అర్పించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ నేతృత్వంలో ఇతర న్యాయమూర్తులు సోమవారం సమావేశం అయ్యారు.
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవినాష్ సోమకాంత్ భాటేకు సోమవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. ఇటీవల మరణించిన మహారాష్ట్రకు చెందిన జస్టిస్ అవినాష్ సోమకాంత్ భాటేకు నివాళి అర్పించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ నేతృత్వంలో ఇతర న్యాయమూర్తులు సోమవారం సమావేశం అయ్యారు. సీజే జస్టిస్ లిసాగిల్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్.. జస్టిస్ అవినాష్ అందించిన న్యాయసేవలను గుర్తు చేసుకున్నారు. కొద్దిసేపు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ భాటే కుటుంబ సభ్యులు, బార్ కౌన్సిల్ ఛైర్మన్ యలమంజుల బాలాజీ, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్