యువ న్యాయవాదులకు పునశ్చరణ
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:38 AM
హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న యువ న్యాయవాదుల వృత్తి నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రత్యేక పునశ్చరణ (ఓరియంటేషన్) ప్రోగ్రామ్ను ప్రారంభించింది.
కార్యక్రమాన్ని ప్రారంభించిన హైకోర్టు సీజే లిసాగిల్
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న యువ న్యాయవాదుల వృత్తి నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రత్యేక పునశ్చరణ (ఓరియంటేషన్) ప్రోగ్రామ్ను ప్రారంభించింది. హైకోర్టులోని అసోసియేషన్ హాలులో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే లిసాగిల్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ చీమలపాటి రవి హాజరయ్యారు. ముఖ్య అతిథి సీజే లిసాగిల్ కార్యక్రమాన్ని ప్రారంభించి... పలు అంశాలపై యువ న్యాయవాదులకు దిశానిర్దేశం చేశారు. న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి.. న్యాయవాద వృత్తిలో తన అనుభవాలను యువ న్యాయవాదులతో పంచుకున్నారు. కోర్టులో జరిగే విచారణలను లోతుగా పరిశీలించాలని సూచించారు.
జస్టిస్ బట్టుదేవానంద్ మాట్లాడుతూ... న్యాయవాద వృత్తి జీవితంలో విజయం సాధించేందుకు నిరంతర అధ్యయనం అవసరమన్నారు. అసోసియేషన్ నిర్వహించిన క్రీడ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆయన బహుమతులు అందజేశారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నిరంజన్, పలువురు న్యాయవాదుల, సంఘం ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో యువ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..