అప్పన్న సేవలో జస్టిస్ లక్ష్మణరావు
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:44 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఆదివారం సతీసమేతంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.
సింహాచలం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఆదివారం సతీసమేతంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభ ఆలింగనం అనంతరం అర్చకులు అంతరాలయంలో గోత్రనామాలతో పూజలు చేసి, న్యాయమూర్తికి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత పండితులు వేదాశీర్వచనాలీయగా, ఏఈఓ సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్