Share News

విశాఖలో విమాన సర్వీసుల నిలిపివేతపై పిల్‌

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:03 AM

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో కమర్షియల్‌ విమాన సర్వీసులు నిలిపివేయడంతోపాటు భోగాపురం విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూలై 28న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ...

విశాఖలో విమాన సర్వీసుల నిలిపివేతపై పిల్‌

  • విశాఖలో విమాన సర్వీసుల నిలిపివేతపై పిల్‌

  • జోక్యానికి హైకోర్టు నిరాకరణ

  • సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడి

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో కమర్షియల్‌ విమాన సర్వీసులు నిలిపివేయడంతోపాటు భోగాపురం విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూలై 28న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. విశాఖ నుంచి భోగాపురం చేరుకునేందుకు ఆరు వరుసలతో రోడ్డు నిర్మాణం పూర్తయ్యేవరకూ డొమిస్టిక్‌ విమాన సర్వీసులను విశాఖ నుంచి నడిపేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి ఎం.రామారావు మరో ఇద్దరు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ ఇటీవల విచారణ రాగా.. విమానాల సమయాలకు తగ్గట్లు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారా? ఏఏ సమయాల్లో బస్సులు తిప్పుతున్నారు? పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పిల్‌ బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఠాగూర్‌ యాదవ్‌ వాదనలు వినిపిస్తూ.. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కలుపుతూ చేపట్టిన రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదన్నారు.


విమనాశ్రయం చేరుకొనేందుకు రెండు గంటల సమయం పడుతోందన్నారు. భోగాపురానికి రోడ్డు నిర్మించే వరకూ డొమిస్టిక్‌ విమాన సర్వీసులను విశాఖ నుంచి నడిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ బదులిస్తూ... భోగాపురం అందుబాటులోకి వచ్చినరోజే విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సర్వీసులు నిలిపివేయాలని ఒప్పందం ఉందన్నారు. విమాన సర్వీసులకు అనుగుణంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. పిల్‌ను కొట్టివేయాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:03 AM