Share News

ఆర్థిక ఇబ్బందులతో న్యాయసేవలు దూరం కాకూడదు

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:24 AM

ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్కరికీ న్యాయసేవలు దూరం కాకూడదని, బాధితులకు సరైన సమయంలో న్యాయసేవలందించేందుకు న్యాయసేవాధికార సంస్థలు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌ పిలుపునిచ్చారు.

ఆర్థిక ఇబ్బందులతో న్యాయసేవలు దూరం కాకూడదు

  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్కరికీ న్యాయసేవలు దూరం కాకూడదని, బాధితులకు సరైన సమయంలో న్యాయసేవలందించేందుకు న్యాయసేవాధికార సంస్థలు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌ పిలుపునిచ్చారు.

న్యాయసేవల ఫలాలు అందరికీ అందినప్పుడే రాజ్యాంగంలో పొందుపర్చిన సమాన న్యాయం అనే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఉచిత న్యాయసేవల కేంద్రాన్ని’ సహచర న్యాయమూర్తుల సమక్షంలో చీఫ్‌ జస్టిస్‌ లిసాగిల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ... పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో న్యాయ సేవల కేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు. అర్హులైన వారందరూ ఈ కేంద్రం ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు పొందవచ్చని సూచించారు.

కార్యక్రమంలో ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, హైకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి మాలతి, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:30 AM