Share News

రాహుల్‌ గాంధీ రాజకీయ అసమర్థుడు

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:48 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓ రాజకీయ అసమర్థుడని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్‌ చేస్తోన్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు.

రాహుల్‌ గాంధీ రాజకీయ అసమర్థుడు

  • ఓటు చోరీ పేరుతో తప్పుడు ప్రచారం: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, విజయవాడ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓ రాజకీయ అసమర్థుడని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్‌ చేస్తోన్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం, సర్‌ ప్రక్రియపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6, ఓటరు పేరుపై అభ్యంతరాలకు ఫారం 7, చిరునామా మార్పునకు ఫారం 8.. ఇలా ప్రతి దశలోనూ వెసులుబాటు ఉందన్నారు. ‘ఓటు కోల్పోయిన వ్యక్తులు ఎక్కడున్నారో చూపించాలి.. ఆధారాలు సమర్పించి అడగాలి.. ఎన్నికల్లో ప్రజా తీర్పును స్వీకరించాలి.. అవేవీ చేయకుండా రాజ్యాంగ సంస్థలపై అనుమానాలు సృష్టించడం మంచిది కాదు’ అన్నారు.

జగన్‌కు భయం పట్టుకుంది..

వైసీపీ అధినేత జగన్‌పైనా మంత్రి సత్యకుమార్‌ సెటైర్లు వేశారు. సింగిల్‌గా వస్తానని ప్రచారం చేసుకునే సింహానికి ఇప్పుడు భయం పట్టుకుందని, అందుకే వామపక్షాలతో జత కట్టేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. పులివెందుల స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉందని, దమ్ముంటే వాటిని ఆపాలని జగన్‌కు సవాల్‌ విసిరారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 05:49 AM