Share News

పెరిగిన ఎండ

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:05 AM

నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. సోమవారం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరు, ఒంగోలుల్లో 38.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

పెరిగిన ఎండ

  • నెల్లూరు, ఒంగోలుల్లో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత

విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. సోమవారం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరు, ఒంగోలుల్లో 38.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ అనిశ్చితి కారణంగా సోమవారం సాయంత్రం కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. మంగళవారం మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, ఇతర ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 04:05 AM