Share News

జోనల్‌ క్యాడర్‌లోకి జడ్పీ హెచ్‌ఎం పోస్టులు

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:21 AM

నూతన ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌ ప్రకారం పలు టీచర్‌ పోస్టుల క్యాడర్లను పునర్‌వ్యవస్థీకరిస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం..

జోనల్‌ క్యాడర్‌లోకి జడ్పీ హెచ్‌ఎం పోస్టులు

కేడర్లు పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): నూతన ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌ ప్రకారం పలు టీచర్‌ పోస్టుల క్యాడర్లను పునర్‌వ్యవస్థీకరిస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం.. జిల్లా పరిషత్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టులు జోనల్‌ కేడర్‌గా పరిగణించారు. ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ హెచ్‌ఎం పోస్టులతో సమానంగా ఈ మేరకు మార్పులు చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు జిల్లా క్యాడర్‌లో ఉంటాయి. మోడల్‌ స్కూల్‌ హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, క్రాఫ్ట్‌ టీచర్‌, డ్రాయింగ్‌ టీచర్‌, మ్యూజిక్‌ టీచర్‌, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, కుట్టుపని టీచర్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు జిల్లా క్యాడర్‌ పరిధిలోనే ఉంటాయి. అలాగే భాషా పండితులు, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ పోస్టులు కూడా జిల్లా క్యాడర్‌లోనే ఉంటాయి. నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలకు జిల్లా లేదా జోన్‌ యూనిట్‌గా పరిగణిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో 95శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు. కాగా, జడ్పీ పాఠశాలల హెచ్‌ఎంలకు జోనల్‌ క్యాడర్‌ ఇచ్చినందుకు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు జి.హృదయరాజు హర్షం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 04:21 AM