ఐఏఎస్ విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:53 AM
కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ పీడీ, ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు పడింది. ఇటీవల బెంగళూరులోని పబ్‌లో పోలీసులతో ఆయన గొడవ పడటం, కేసు నమోదైన నేపథ్యంలో..
జీఏడీకి సరెండర్ చేసిన ప్రభుత్వం
అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ పీడీ, ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు పడింది. ఇటీవల బెంగళూరులోని పబ్‌లో పోలీసులతో ఆయన గొడవ పడటం, కేసు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను జీఏడీకి సరెండర్ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్ నియామకానికి ఏర్పాట్లు చేసుకోవాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించారు. విక్రాంత్ మర్మత్ కొంత కాలంగా కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ పీడీగా పనిచేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్‌లో పోలీసులపై దాడి చేసినట్టు కేసు నమోదైంది. ఈ వార్త ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..