Share News

బీసీ కోటాపై నేడు సుప్రీంకు!

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:53 AM

బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేయనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన రెండు జీవోలను గురువారం హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే.

బీసీ కోటాపై నేడు సుప్రీంకు!

  • ఏజీ, న్యాయనిపుణులతో మరోసారి సీఎం చర్చలు

  • పిటిషన్‌ దాఖలులో జాప్యం చేయొద్దు

  • బీసీలకు 34 శాతం కోటా కల్పనే మా లక్ష్యం

  • అవరోధాలు అధిగమించి రిజర్వేషన్లు అమలు చేసి తీరతాం: చంద్రబాబు

  • వచ్చే వారం విచారణకు వచ్చే చాన్సు!

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేయనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన రెండు జీవోలను గురువారం హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. తీర్పు వచ్చిన వెంటనే అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌తోపాటు సీనియర్‌ న్యాయనిపుణులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో తక్షణం పిటిషన్‌ వేయాలని ఆదేశించారు. శుక్రవారం మరోసారి దమ్మాలపాటితోపాటు ఢిల్లీలోని న్యాయనిపుణులతో ముఖ్యమంత్రి చర్చించారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంలో ఎలాంటి జాప్యం వద్దని, శనివారమే దాఖలు చేయాలని సూచించారు.

దీంతో శనివారం మధ్యాహ్నం రాష్ట్రప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసేందుకు న్యాయవాదులు సంసిద్ధమవుతున్నారు. శనివారం పిటిషన్‌ వేస్తే వచ్చేవారం పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సీనియర్‌ న్యాయవాదులను నియమించుకుని పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల తరఫున పటిష్ఠ వాదనలు వినిపించాలని సీఎం ఆదేశించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్యసాధనలో ఎదురయ్యే అవరోధాలన్నింటినీ అధిగమించి రిజర్వేషన్లను అమలు చేసి తీరాలన్నదే తమ ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 03:53 AM