Share News

రోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:31 AM

రోగుల భద్రత కోసం ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రోగుల భద్రతకు ప్రత్యేక అధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసింది.

రోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రోగుల భద్రత కోసం ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రోగుల భద్రతకు ప్రత్యేక అధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు రోగుల భద్రతతోపాటు 11 కీలక అంశాలపై పర్యవేక్షణ చేయనున్నాయి. ప్రతిఅంశానికీ సంబంధిత వైద్య విభాగం నుంచి ఒక అధ్యాపకుడిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించింది.

మందుల వినియోగం, శస్త్రచికిత్సలు, రక్తమార్పిడి, వైద్య పరికరాల వినియోగం, పరీక్షలు, ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్ల నియంత్రణ వంటి అంశాల్లో భద్రతా ప్రమాణాలు పాటించేలా కమిటీలు పర్యవేక్షిస్తాయి. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఈ కమిటీలు దోహదపడతాయి. కమిటీల పనితీరుపై సంబంధిత బోధనాస్పత్రుల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్థన్‌ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 05:31 AM