చెట్ల ట్రాన్స్‌లొకేట్‌కు చర్యలు తీసుకున్నాం
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:01 AM
ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులకు అడ్డుగా ఉన్న చెట్లను కొట్టివేయకుండా ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.
ట్రీ ప్రొటెక్షన్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశాం: ఎస్‌జీపీ
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులకు అడ్డుగా ఉన్న చెట్లను కొట్టివేయకుండా ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఇందుకోసం ట్రీ ప్రొటెక్షన్ అడ్వైజనరీ కమిటీని ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.ప్రణతి వివరించారు. రాజమండ్రి అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని చెప్పారు. చెట్ల నరికివేతపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు మెయిల్‌తో పాటు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వివరాలతో ధర్మాసనం సంతృప్తి చెందింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పిటిషనర్ సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పిల్‌పై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, పిటిషనర్ తరఫున న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపించారు.
ఈ వార్తలనూ చదవండి..