Share News

పంచాయతీరాజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:23 AM

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌-2010లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. కొత్త సవరణల ప్రకారం క్లాస్‌-ఏలోని పర్యవేక్షణ పోస్టులను 4 కేటగిరీలుగా పేర్కొన్నారు.

పంచాయతీరాజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు

  • కొత్తగా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కేటగిరీలు

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌-2010లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. కొత్త సవరణల ప్రకారం క్లాస్‌-ఏలోని పర్యవేక్షణ పోస్టులను 4 కేటగిరీలుగా పేర్కొన్నారు. అవి పంచాయతీ డెవలెప్‌మెంట్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3, డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులు. పదోన్నతులు పొందాలంటే సంబంధిత కింది కేటగిరీ, క్లాస్‌ లేదా గ్రేడ్‌లో కనీసం రెండేళ్ల సర్వీస్‌ పూర్తిచేసి ఉండాలి. పీడీఓ గ్రేడ్‌-1 పోస్టులకు నియామక యూనిట్‌ను ఆరు జోన్లుగా నిర్ణయించారు. పీడీఓ గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 పోస్టులకు నియామక అధికారిగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఉంటారు. పీడీఓ గ్రేడ్‌-3, డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జిల్లా యూనిట్‌గా నిర్ణయించారు. వీటికి జిల్లా కలెక్టర్‌ నియామక అధికారి. ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీచేసే పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వీస్‌ రూల్స్‌లో కొత్తగా కేటగిరీ 8(ఏ)గా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(డీపీఓ యూనిట్‌)/అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(జడ్పీ యూనిట్‌), 8(బి)గా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(హెచ్‌ఓడీ) పోస్టులను చేర్చారు. డీడీఓ, జడ్పీ డిప్యూటీ సీఈఓ తదితర పోస్టులకు మల్టీ జోన్‌-1, మల్టీ జోన్‌-2 యూనిట్లను నిర్దేశించారు. ఎంపీడీఓ, డీఎల్‌పీఓ, డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులను ఆరు జోన్ల పరిధిలో ఏర్పాటు చేశారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖలోనూ..

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖలోని ఉద్యోగ నియామక నిబంధనల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు సర్వీసు నిబంధనలను సవరిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 05:23 AM