Share News

ఓఅండ్‌ఎం పనులకు 160 కోట్లు విడుదల

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:45 AM

కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.160 కోట్ల బిల్లులు విడుదల చేసింది.

ఓఅండ్‌ఎం పనులకు 160 కోట్లు విడుదల

  • కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణ: నిమ్మల

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.160 కోట్ల బిల్లులు విడుదల చేసింది. బిల్లులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం రద్దు చేసిన సాగునీటి సంఘాల వ్యవస్థను ముఖ్యమంత్రి పునరుద్ధరించి రైతులకు కొండంత భరోసా కల్పించారని పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఓఅండ్‌ఎం పనులకు రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. దీనివల్ల సాగునీటి వ్యవస్థ నిర్వహణ తీవ్రంగా దెబ్బతిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే ఓఅండ్‌ఎం పనుల కోసం రూ.1,320కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 05:45 AM