Share News

2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:44 PM

హజ్ యాత్రికులకు 2026 ఏడాదికి సంబంధించి లక్ష రూపాయల సబ్సిడీ విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ శాఖ వ్యవహారాల సలహాదారు ఎన్ఎండీ షరీఫ్ తెలిపారు. 331 మంది హజ్ యాత్రికుల ఖాతాల్లో 3.31 కోట్ల రూపాయలు జమ అయినట్లు వెల్లడించారు.

2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల
Haj Subsidy

ఇంటర్‌నెట్ డెస్క్: హజ్ యాత్రికులకు 2026 ఏడాదికి సంబంధించి లక్ష రూపాయల సబ్సిడీ విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ శాఖ వ్యవహారాల సలహాదారు ఎన్ఎండీ షరీఫ్ తెలిపారు. 331 మంది హజ్ యాత్రికుల ఖాతాల్లో 3.31 కోట్ల రూపాయలు జమ అయినట్లు వెల్లడించారు. విజయవాడ విమానాశ్రయం నుంచి వెళ్లిన హజ్ యాత్రికులకు సబ్సిడీ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. విమాన చార్జీల అదనపు భారానికి పరిహారంగా లక్ష రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. 2026లో రాష్ట్రం నుంచి 1,987 మంది హజ్ యాత్రకు వెళ్లినట్లు వెల్లడించారు.


బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘విజయవాడ నుంచి 331 మంది, బెంగళూరు నుంచి సుమారు 500 మంది హజ్ యాత్రకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సబ్సిడీ విడుదల చేశాం. హజ్ యాత్రికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తోందనడానికి ఇదే నిదర్శనం. సీఎం చంద్రబాబుకు హజ్ యాత్రికుల తరఫున కృతజ్ఞతలు. సబ్సిడీ విడుదల ఆలస్యంపై తప్పుడు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి’ అని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

రాష్ట్ర అజెండా మారుస్తా: కవిత

5 రోజులు శిథిలాల కిందే.. వైరల్‌గా మారిన కుక్క పిల్ల వీడియో..

Updated Date - Jul 01 , 2026 | 07:01 PM