‘పేదల సేవలో’..
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:06 AM
పెన్షన్ ద్వారా పేదలకు ఆర్థికభద్రత, ఆత్మగౌరవాన్ని కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత అన్నారు. ప్రతినెలా 62 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు.
దేశానికే ఆదర్శం: పీతల సుజాత
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పెన్షన్ ద్వారా పేదలకు ఆర్థికభద్రత, ఆత్మగౌరవాన్ని కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత అన్నారు. ప్రతినెలా 62 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ఏపీలో పెన్షన్ మొత్తాన్ని ఇస్తున్నామని, రాష్ట్రంలో అమలు చేస్తున్న పేదల సేవలో కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం