34 శాతం కోటాపై సుప్రీంలో బలమైన వాదనలు!
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:37 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
న్యాయనిపుణులతో నేడు కూటమి నేతల భేటీ
న్యూఢిల్లీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి తదితరులు మంగళవారం ఢిల్లీలో ప్రముఖ న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, హైకోర్టు తీర్పుపై వారితో చర్చించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం