విద్యారంగంలో సమూల మార్పులు: శివప్రసాద్
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:05 AM
కూటమి ప్రభుత్వ పాలనలో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని ఏపీ ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జడ్ శివప్రసాద్ అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వ పాలనలో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని ఏపీ ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జడ్ శివప్రసాద్ అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తున్నారు. ఉపాధ్యాయులపై ఉన్న అనవసరమైన బోధనేతర పనుల భారాన్ని తొలగించాం. వారు తమ పూర్తి సమయాన్ని విద్యార్థులకే కేటాయించడానికి తగిన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించింది. పాఠశాలల అభివృద్ధి అంటే వైసీపీ హయాంలో చేసినట్లు కేవలం రంగులు వేయడం, ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం కాదు’ అని శివప్రసాద్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..