Share News

రూ.35కే కిలో ఉల్లి

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:10 AM

ఉల్లి ధరల పెరుగుదల నేపథ్యంలో కిలో రూ.35 చొప్పున రైతుబజార్లలో బుధవారం నుంచి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్‌కార్డు లేదా రేషన్‌కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి, నెలకు రెండు కిలోల చొప్పున సరఫరా చేయనున్నారు.

 రూ.35కే కిలో ఉల్లి

  • ఆధార్‌/రేషన్‌కార్డుపై నెలకు రెండు కిలోలు

  • నేటి నుంచి విజయవాడ రైతుబజార్లలో విక్రయం

  • త్వరలో రాష్ట్రవ్యాప్తంగా.. మంత్రులు అచ్చెన్న, మనోహర్‌

అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధరల పెరుగుదల నేపథ్యంలో కిలో రూ.35 చొప్పున రైతుబజార్లలో బుధవారం నుంచి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్‌కార్డు లేదా రేషన్‌కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి, నెలకు రెండు కిలోల చొప్పున సరఫరా చేయనున్నారు. తొలి విడతగా విజయవాడలోని అన్ని రైతుబజార్లలో రాయితీ ధరకు ఉల్లిపాయల్ని విక్రయించనున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌరసఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మంగళవారం తెలిపారు. ‘రాష్ట్రంలో ఉల్లి ధరల పెరుగుదలతో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టింది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెట్‌ను సమీక్షిస్తోంది. ఉల్లిధరల విషయంలోనూ ప్రజలకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో రాయితీ ధరకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల డిమాండ్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతుబజార్లలో రాయితీ ఉల్లిని అందుబాటులోకి తెస్తాం’ అని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 05:10 AM