Share News

11 యూడీఏ చైర్‌పర్సన్‌ల పదవీకాలం పొడిగింపు

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:49 AM

రాష్ట్రంలోని 11 పట్టణాభివృద్ధి అథారిటీల చైర్మన్ల పదవీకాలాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరులో పదవీకాలం ముగియనున్న చైర్మన్లు మరో రెండు నెలల పాటు ..

11 యూడీఏ చైర్‌పర్సన్‌ల పదవీకాలం పొడిగింపు

  • స్వచ్ఛాంధ్ర, టిడ్కో చైర్మన్లకూ వర్తింపు

  • నవంబరు నుంచి రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 11 పట్టణాభివృద్ధి అథారిటీల చైర్మన్ల పదవీకాలాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరులో పదవీకాలం ముగియనున్న చైర్మన్లు మరో రెండు నెలల పాటు అదే పదవుల్లో కొనసాగేందుకు ప్రభుత్వం అనుమతించింది. గతంలో 2024 నవంబరు 12న పలువురు చైర్మన్లను నియమించగా, 2025 సెప్టెంబరు 29న జారీచేసిన ఉత్తర్వుల ద్వారా వారి పదవీకాలాన్ని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచారు. ప్రస్తుతం ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో మరో రెండు నెలలు పొడిగించారు.

అమలాపురం, రాజమహేంద్రవరం, బొబ్బిలి, బాపట్ల, కడప, శ్రీకాకుళం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం పట్టణాభివృద్ధి అథారిటీల చైర్‌పర్సన్‌లకు పొడిగింపు వర్తిస్తుంది. అలాగే ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీయూఎఫ్ఐడీసీ) చైర్మన్‌, 13 మంది డైరక్టర్లు, టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయ్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరాం పదవీకాలాన్ని కూడా మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 04:49 AM